మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 24
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు బుధవారం నాడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులు రాజుపేట ఏరియా కు చెందిన కే.లక్ష్మి 21 వేల రూపాయలు,ముత్యాలమ్మ నగర్ గ్రామానికి చెందిన ఏ శ్రీలక్ష్మి 24 వేల రూపాయల చెక్కులను విప్ రేగా చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.ఈసందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ, అనారోగ్యానికి గురై,ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప వరంలా మారింది అన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ,సీఎం కేసీఆర్ పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు.కోట్ల రూపాయలు వెచ్చించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు విప్ రేగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం.నరసింహారావు ఎంపీటీసీల జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు,కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాష,సర్పంచ్ లు ఏనిక.ప్రసాద్,రామకృష్ణ, జంపేశ్వరి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,సీనియర్ నాయకులు వట్టం.రాంబాబు, యాదగిరి గౌడ్,యూసఫ్, యువజన నాయకులు సాగర్ యాదవ్,రవి ప్రసాద్, హర్షనాయుడు,సృజన్ తదితరులు పాల్గొన్నారు.