మన్యంన్యూస్ ఇల్లందురూరల్: ఇల్లందు మండలం వీరాపురం కు చెందిన ఈసాల వెంకటయ్య(లేట్)భద్రమ్మ దంపతుల కుమారుని వివాహ వేడుకకు హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య నూతన దంపతులు సురేష్సంధ్య లకు నూతన వస్త్రాలు బహూకరించారు. వదువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.మరో కార్యక్రమంలో ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన కోరం నాగేశ్వరరావు_అరుణ దంపతుల కుమార్తె శ్రీవిద్య ఓణీల వేడుకకు హాజరై చిన్నారి ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వారివెంట ఎంపీటీసీలు మండల రాము,పూనెం సురేందర్, సనప సోమేష్,నాయకులు మడుగు సాంబమూర్తి, తాటి బిక్షం,గుగ్లోత్ నాగార్జున, హరి సింగ్ నాయక్, రావూరి సతీష్,కుంటా రాజు, ప్రసన్న కుమార్ యాదవ్, అజ్జు భాయ్, బండి ఆనంద్,శేఖర్, తదితరులు పాల్గొన్నారు.