మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు పట్టణ లోని స్థానిక జేకే సింగరేణి గ్రౌండ్లో ఈనెల 27న శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఇల్లందు పట్టణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఆత్మీయ సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేయుచున్నారని పేర్కొన్నారు. భారీఎత్తున జరిగే ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇల్లందు పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు మరియు అనుబంధ సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు విజయవంతం చేయాలని శ్రీనివాసరెడ్డి కోరారు
