డయాలసిస్ సేవలు ప్రారంభించడం పట్ల వర్షం వ్యక్తం చేసిన ప్రజా ప్రతినిధులు
విప్ రేగా కాంతారావు,జిల్లా కలెక్టర్ అనుదీప్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ ఏనిక ప్రసాద్
మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 24
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి నందు 50 లక్షల రూపాయల వ్యయం తో డయాలసిస్ సెంటర్ ను బుధవారం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు,జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రారంభించారు. ఏజెన్సీ ఏరియాలో డయాలసిస్ సేవలు ప్రారంభించడం అభినందనీయం అని సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు.డయాలసిస్ సెంటర్ ఏర్పటూ తో నియోజకవర్గంలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగుల బాధలు తిరనున్నయని, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కు ప్రత్యేక కృషి చేసిన కాంతారావు కు,జిల్లా కలెక్టర్ అనుదీప్ కు గ్రామ పంచాయతీ ప్రజల తరఫున మణుగూరు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు కూనవరం సర్పంచ్ ఏనిక.ప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బుగ్గ సర్పంచ్ తాటి.రామకృష్ణ,తోగ్గుడెం. సర్పంచ్ బోగ్గం.రజిత, ముత్యాలమ్మ నగర్ సర్పంచ్ కొమరం జంపేశ్వరి తదితరులు పాల్గొన్నారు.