మన్యం న్యూస్.ములకలపల్లి .మే 24.
మండలం లోని పలు ప్రాంతాల్లోని టైలరింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ 2023-24 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్ ను ముందస్తు ప్రణాళిక తో మార్చి నెలలోనే యూనిఫామ్ పాఠశాల లకు అందించామని, ప్రధానోపాధ్యాయులు వెంటనే టైలరింగ్ వద్దకు చేర్చి, నూతన కొలతల ల ప్రకారం రెండు జతలు యూనిఫామ్ పాఠశాలలు తెరిచే నాటికి ఇచ్చే విధంగా ముందస్తు ప్రణాళిక తో సిద్ధం చెయ్యాలని ,ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, టైలర్ లను సమన్వయపరచుకొని, మే 31 తారీకు నిర్నిత సమయానికి యూనిఫామ్ దుస్తులు పాఠశాలకు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.ఈ కార్యక్రమం లోమండల విద్యాధికారి కమ్యూనిటీ మొబిలైజషన్ అధికారి యస్. కె. సైదులు,అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్, గణాంక అధికారి ఎన్. సతీష్ కుమార్ టైలర్ లు, కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ లు తదితరులు పాల్గొన్నారు.
