- మణుగూరు పట్టణంలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
- పట్టణ పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 25
మణుగూరు పట్టణంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మణుగూరు పట్టణంలో సుమారు 50 లక్షల రూపాయలతో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ,క్లీనింగ్ పనులను విప్ రేగా మున్సిపాలిటీ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,మణుగూరు పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు.ఇందులో భాగంగా నూతన డ్రైనేజీ నిర్మాణాలు,డ్రైనేజీ క్లీనింగ్, కాలువల పారిశుధ్యం క్లీనింగ్ పనులు చేపట్టామన్నారు. పనుల కూడా ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు.ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులపై మున్సిపల్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది అన్నారు.రానున్న వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు సూచనలు చేయడం జరిగింది.నూతన డ్రైనేజీ పనులను,క్లీనింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు ఆదేశించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు,ఏఈ నాగేశ్వరరావు,ప్రజాప్రతినిధులు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అప్పారావు కార్యదర్శి నవీన్,సీనియర్ నాయకులు ఎడ్ల.శ్రీను, యూసఫ్,లక్ష్మయ్య,రమణ,రమేష్,యువజన నాయకులు సాగర్ యాదవ్,హర్ష నాయుడు,గుర్రం సృజన్, రవిప్రసాద్, రాజు తదతరులు పాల్గోన్నారు