మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఆవిర్భావ వేడుకలు పెద్ద ఎత్తున జెండాలు ఎగరవేసి ఐక్యతను సాటి చెప్పారు. వెంకటాపురం మండలంలోని
వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ పరిధిలోని హనుమాన్ సెంటర్లో ఉన్నటువంటి వాడబలిజ సేవా సంఘం దిమ్మ దగ్గర గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై వాడబలజ సేవా సంఘం ఆవిర్భావం సందర్భంగా జండా ఎగరవేసి నినాదాలు చేశారు. అనంతరం విచ్చేసిన రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ కులస్తులందరూ కూడా మత్స్యకార సొసైటీలు ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు అప్లై చేసుకుని సబ్సిడీలో వలలు పడవలు టీవీఎస్ బైక్ బొలెరో లు చాపల చెరువులు సబ్సిడీలో పొందవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ డర్ర శివరాణి, కొప్పుల మల్లయ్య, డర్ర దామోదర్, వాదం.వెంకన్న ,చిట్టిబాబు, వెంకన్న, గణపతి, మల్లయ్య, రవిచంద్రమూర్తి, మల్లికార్జున్, సారయ్య, రాంబాబు, సాంబు, నరసింహారావు, వెంకటేశ్వర్లు, రవి, విజయ్, తదితరులు పాల్గొన్నారు.
