మన్యంన్యూస్,ఇల్లందు:ఇల్లందు పట్టణంలో శనివారం జరగబోయే ఆత్మీయ సమ్మేళనం వాయిదా పడినట్లు ఇల్లందు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ…ఉమ్మడి జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం నాడు పినపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని ఈ కారణంగా శనివారం పట్టణంలో జరగబోయే ఆత్మీయ సమ్మేళనం వాయిదా వేయడం జరిగిందని ఆయన తెలిపారు. సోమవారం జరగబోయే ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి పువ్వాడ అజయ్, పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితలు ముఖ్య అతిథులుగా హాజరవుతారని, కార్యకర్తలు, నాయకులు అధికసంఖ్యలో పాల్గొని పట్టణ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు.
