ఆదివాసీల కు అండగా తెలంగాణ ప్రభుత్వం*
*ఇసుక రీచ్ లతో గిరిజన సాధికారత చుంచుపల్లి లో ఇసుక పేసా గ్రామ సభ.
*ఏటూరు నాగారం ఐటీడీఏ
పెసా జిల్లా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల కు అండగా ఉంటూ ఆర్థిక సాధికారత సాధించ డానికి చేయూత నిస్తుందని ఏటూరు నాగారం ఐటిడిఏ పె సా జిల్లా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ అన్నారు.ములుగు ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక రీచ్ లను ఆదివాసీలకు కేటాయిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దోహదప డుతుందన్నారు.అందులో భాగంగానే శుక్రవారం మంగపేట మండలంలోని చుంచుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 3,4,5 ఇసుక రీచ్ లను ఆదివాసీల కు కేటాయించిందన్నారు.5వ షెడ్యుల్డ్ భూభాగంలో పెసా చట్టం ప్రకారం స్వయం నిర్ణయ అధికారం గ్రామ సభ తీర్మానం అంతిమం కాబట్టి శుక్రవారం పెసా గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . చుంచుపల్లి గ్రామంలో 444 ఎస్టీ ఓటర్లు ఉండగా1/3 కోరం ప్రకారం గా 148 హాజరు కావలసి ఉండగా 250 హాజరైనారు.చుంచుపల్లి గ్రామంలో 3,4,5 క్వారి లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు.5వ క్వారీని నరసింహస్వామి గిరిజన ఇసుక క్వారి లేబర్ కాంట్రక్టు మ్యూచువల్ ఎయిడెడ్ కో ఓపరటివ్ సొసైటీ కి చేతులెత్తే విధానం ద్వారా ఏకగ్రీవంగా కైవసం చేసుకొంద న్నారు.3,4 వ క్వారీని చెంచు లక్మి ట్రైబల్ సొసైటీ కైవసం చేసుకొందన్నారు.ఈ కార్య క్రమంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి వాసు, ఎంపీడీవో శ్రీనివాస్,గ్రామ కుల ఆచార సాంప్రదాయ పెద్దలు కురసంనర్సింగరావు,తెల్లంనాగేశ్వరరావు,పంచాయతీ కార్యదర్శి సాంబమూర్తి,పెసా కమిటీ సభ్యులు కోరం అబ్బయ్య,పెసా మోబిలైజర్ రఘు రామ్ తదితరులు పాల్గొన్నారు.