దేశంలోని దళిత, గిరిజన ప్రజల వ్యతిరేకి ప్రధాని నరేంద్రమోడీ* పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వనించకపోవడం దుర్మార్గం:ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రవి మన్యంన్యూస్,ఇల్లందు:దేశంలో దళిత, గిరిజనుల వ్యతిరేక పాలన నడుస్తోందని, దళిత,గిరిజనుల వ్యతిరేకి ప్రధానమంత్రి నరేంద్రమోడీ అని ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి రవి ఆరోపించారు. టీపీసీసీ ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆదేశాల మేరకు గిరిజన, ఆదివాసి బిడ్డ అయిన రాష్ట్రపతి ద్రౌపది మురుముకు ప్రధాని నరేంద్రమోడీ ఉద్దేశపూర్వకంగా చేసిన అవమానాన్ని నిరసిస్తూ డాక్టర్ రవి శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఈనెల 28వ తేదీన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభానికి ముర్మును ఆహ్వానించకుండా రాష్ట్రపతి పదవిని ఇచ్చి ఆమెను అడుగడుగున అవమానించడం అంటే ఈ దేశంలో ఉన్న 15 కోట్ల గిరిజన ఆదివాసి బిడ్డలను, 75 కోట్ల మహిళలను అవమానించడమేనని వారు తెలిపారు. ఈ దేశానికి స్వతంత్రమే అవసరం లేదు, బ్రిటిష్ వారి కాళ్లవద్ద బానిసలుగా బతుకుతామని చెప్పిన సావర్కర్ పుట్టినరోజు మే 28 నాడు పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలనుకోవడం ఈ దేశ స్వాతంత్ర సమరయోధులను అవమానపరచడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది మరుము పట్ల బిజెపి ప్రభుత్వ తీరును ఎండగడుతూ దేశవ్యాప్తంగా భారత జాతీయ కాంగ్రెస్ తో పాటు 18పార్టీలు తీర్మానం చేసి పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయాన్ని వెల్లిబుచ్చాయన్నారు. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని గిరిజన ఆదివాసి బిడ్డ , భారతదేశ ప్రథమ పౌరురాలు , రాష్ట్రపతి ద్రౌపది మురుము గారి చేతుల మీదుగా జరపాలని డాక్టర్ రవి డిమాండ్ చేశారు.
