UPDATES  

 *ప్రభుత్వ స్కూల్లో పిల్లలను చేర్పించండి ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి

*ప్రభుత్వ స్కూల్లో పిల్లలను చేర్పించండి
ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి
ప్రచార కరపత్రాలు ఆవిష్కరణ

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

తెలంగాణ ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమం లో భాగంగా కార్పొరేట్ స్కూళ్ల కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తోందని, ప్రతీ ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ల లో చేర్పించాలని పాఠశాల విద్యాశాఖ వరంగల్ ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీ పంచాయతీలోని ఇందిరానగర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మన ఊరు -మనబడి కార్యక్రమంలో భాగంగా నూతన విద్యా సంవత్సరానికి సంబందించిన అడ్మిషన్స్ కోసం ప్రచార కరపత్రాలను ఆర్జెడి ఆవిష్కరించారు. డీఈఓ సోమశేఖర్ శర్మ, ఎంఈఓ జుంకి లాల్, సర్పంచ్ పూనెం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ లగడపాటి రమేష్,వార్డు మెంబర్ ఒట్టి కొండ సాంబశివరావు, హేమచంద్రాపురం స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం లీలా, స్కూల్ హెచ్.ఎం.ఎం.జ్యోతిరాణి, ఎస్ఎంసి ఛైర్మన్ చాంద్ పాషా, ఎస్ఎంసి వైస్ ఛైర్మెన్ రాధిక, విద్యాశాఖ
సీఈవో సైదులు, ఏ ఎం నాగరాజ శేఖర్, ఏఎస్ఓ సతీష్, పంచాయతీ కార్యదర్శి మూజాహిద్ పాషా, ఏఎన్ఎం శాంతిప్రియ, అంగన్వాడీ టీచర్స్ పుష్ప, అంజలి,చిన్నా దేవి, పేరెంట్స్ టీచర్ కళ్యాణి, ఎం డి ఎం వర్కర్స్ స్రవంతి, భాగ్య లక్ష్మీ, విద్యార్థుల తల్లి దండ్రులు,తదితరులు ఈ కార్యక్రమం లోపాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !