మన్యం న్యూస్ చండ్రుగొండ మే 26 : విద్యుత్ షాక్ తో నాలుగు పాడి గేదెలు మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. బాధిత రైతులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి…. మండల పరిధిలోని గానుగపాడు గ్రామానికి చెందిన యెన్నం వెంకన్న, మొగిలిపువ్వు వెంకయ్య, ఇంజం అప్పారావు, ఇంజం పూర్ణమహేష్ లకు చెందిన నాలుగు పాడి గేదెలు శుక్రవారం ఉదయం మేత మేసేందుకు వ్యవసాయ భూములలోకి వెళ్లగా, ఇటీవల గాలివానకి పడిపోయిన విద్యుత్ స్తంభాలకు ఉన్న వైర్లు ప్రమాదవశాత్తు తగలడంతో అక్కడికిఅక్కడే నాలుగు గేదలు మృతి చెందాయి. ఒక్కొక్క గేద విలువ రూ. 80వేలు వరకు నాలుగు పాడి గేదెల గాను మొత్తం రూ.3.20 లక్షలు విలువ ఉంటుందని రైతులు వాపోయారు. బాధిత రైతులను ఆదుకోవాలని, గ్రామస్తులు, తోటి రైతులు కోరుతున్నారు.