UPDATES  

 మంచినీటి సమస్యను పరిష్కరించాలి… తహాసిల్దార్

మంచినీటి సమస్యను పరిష్కరించాలి… తహాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా
మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలంలోని లింగాలకాలనీ గ్రామంలో 35 కుటుంబాలు నివసిస్తున్నాయి.వారు గత ఐదు సంవత్సరాలుగా నీళ్ల సమస్యతో బాధపడుతున్నారు ఎండాకాలం వస్తే మంచినీటి సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఈ సమస్యను పరిష్కరింపజేయాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో చర్ల తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసిల్దారు కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం చర్ల, దుమ్ముగూడెం సబ్ డివిజనల్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న ప్రజా సమస్యలు మాత్రం పరిష్కరింపబడడం లేదని, అభివృద్ధి ఏం జరగలేదని ఏక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నదని ఆయన అన్నారు.బంగారు తెలంగాణ అంటూనే పక్కనే గోదావరి ఉన్న తాగడానికి చుక్క నీరు కూడా లేదని ఈ సమస్యపై మండలంలో గల వివిధ అధికారులకు,ప్రజా ప్రతినిధులకు అనేకసార్లు తెలియ చేసినా ఉపయోగం లేదని వారు అన్నారు. ఇప్పటికైనా తహసీల్దారు జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించుకొని ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఆయన అన్నారు.తాహాసిల్దార్ ఈ సమస్యను పరిష్కరింపజెచేటట్టు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు గుజ్జుల వేణుగోపాల్,రెడ్డిసమ్మక్క,ఎస్.నాగలక్ష్మి,బి.సమ్మక్క,నందిని,సావిత్రి,రామభవాని జెగ్గు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !