పదివేల రూపాయలు ఆర్థిక సహాయం
మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 27: ఇటీవల గ్రామ దీపికలు వారి యొక్క డిమాండ్స్ తో ధర్నా చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే అయితే అశ్వరావుపేట మండల కేంద్రంలో ధర్నా నిర్వహిస్తున్న గ్రామదీపికలకు మద్దతుగా చిట్టి తల్లి సేవా సమితి వ్యవస్థాపకులు, నారంవారిగూడెం సర్పంచ్ మనుగొండ వెంకట ముత్యం సంఘీభావం తెలిపారు. అదేవిధంగా వారికి ఆర్థిక సహాయంగా పదివేల రూపాయలు శనివారం అందించారు. వారి యొక్క డిమాండ్స్ ని ప్రభుత్వం నిర్వహించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎం చలపతి, ఎం భాగ్యరాజు, ఈ నాగేశ్వరావు, ఎం సంతోష్, సీహెచ్ సురేష్, ఎస్ వెంకటేశ్వరావు, ఆర్ రమేష్, సత్తిబాబు, వై రవి శేఖర్, పి కిశోర్, వి శ్రీను, ఎంన్ పోతయ్య, సాయి, లాల్ బాబు, నాగేంద్ర, నాని, పి సురేష్, కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.





