మన్యం న్యూస్, పినపాక:
తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక మండలంలో శనివారం నాడు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఐలాపురం గ్రామం నుండి పోట్లపల్లి గ్రామం వరకు రూ. 1.42 లక్షల వ్యయంతో చేపట్టబోయే బీటీ రోడ్డు మరమత్తు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గడ్డంపల్లి, పోట్లపల్లి గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు. సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని చెప్పారు. అనంతరం పినపాక గ్రామం నుండి గడ్డంపల్లి గ్రామం వరకు రూ.1.50 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభం చేశారు. అనంతరం బోటి గూడెం పంచాయితీలోని మారేడుగూడెం గ్రామానికి నూతనంగా సుమారు రూ.30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పినపాక నియోజకవర్గంలో ముందున్నడూ లేని విధంగా, ఏ ప్రభుత్వము చేయని అభివృద్ధి పనులను బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని, గ్రామ గ్రామానికి రహదారుల నిర్మాణాలు, వంతెనల నిర్మాణాలు పూర్తి చేసిందని అన్నారు. ప్రస్తుతం మారేడుగూడానికి నిర్మించిన వంతెన నిర్మాణంతో గ్రామ ప్రజల కష్టాలు తీరాయని, ప్రతి ఏటా వర్షాకాలంలో వారు ఎదుర్కొనే సమస్యలను ప్రత్యేకంగా గమనించానని, అందుకోసమే శాశ్వత పరిష్కారం చూపిస్తూ వంతెన నిర్మాణం పూర్తి చేశానని తెలియజేశారు. ఆయన మాటలు విన్న గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, ఎంపీటీసీలు చింతపంటి సత్యం, కాయం శేఖర్, వివిధ పంచాయతీల సర్పంచులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు.





