మన్యం న్యూస్, పినపాక:
అంగన్వాడి సూపర్వైజర్ సత్యవతి ఆధ్వర్యంలో మండలంలోని వివిధ అంగన్వాడి కేంద్రాల పరిధిలోని గ్రామాలలో ప్లాస్టిక్ నివారణ కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్ ను అధికంగా వాడడం వల్ల కలిగే నష్టాలను గురించి గ్రామంలోని స్త్రీలకు వివరించడం జరిగింది. బందగిరి నగర్, మడతన కుంట, బోటి గూడెం, ఉప్పాక గ్రామాలలోని అంగన్వాడీ కార్యకర్తలకు వేసవి కాలంలో మొక్కల పెంపకం గురించి సలహాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు స్వరూప, సరిత, సత్యవతి, మహిళలు పాల్గొన్నారు.





