అభివృధి సంక్షేమమే బిఅర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం
పలు అభివృద్ధి పనులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 28
మణుగూరు మండలం లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.ఇందులో భాగంగా ముత్యాలమ్మ నగర్ పంచాయతీ పరిధిలో సుమారు 7 కోట్ల 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీ అభివృధి పనులను విప్ రేగా కాంతారావు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ,పనులను వేగంగా పూర్తి చేసి,ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలని అని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలం లోని బొంబాయి కాలనీ నందు మహాత్మా గాంధీ విగ్రహా సుందరీ కరణ కోసం 35 లక్షల రూపాయలతో అంచనా వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో విప్,రేగా కాంతారావు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోశం. నర్సింహారావు,పిఏసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, ఎంపిటిసిల జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు,పంచాయితీ రాజ్ ఏఈ రెయిన్ హార్ట్, మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ లు కొమరం.జంపేశ్వరి,ఏనిక.ప్రసాద్,బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,టిబిజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వి.ప్రభాకర్ రావు,కార్యదర్శి నవీన్,పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు





