మన్యం న్యూస్ , పినపాక:
మండల పరిధిలోని బయ్యారం గ్రామానికి చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తుడు మేకల రామకృష్ణ కు పినపాక మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి సాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. విషయం తెలిసిన వెంటనే స్పందించి సాయం అందించిన సతీష్ రెడ్డికి రామకృష్ణ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.





