మన్యం న్యూస్ దుమ్మగూడెం మే 28::
మండలంలోని ములకపాడు నుంచి లక్ష్మీపురం వరకు 20 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆర్ అండ్ బి రోడ్డు నాణ్యత లేకుండా నాసిరకంగా నిర్మిస్తున్నారని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకులు ఆరోపించారు. మండల పరిధిలోని అటవీశాఖ అధికారుల అనుమతుల కోసం అభివృద్ధికి నోచుకోని వంటి ఆర్లగూడెం నుంచి లచ్చిగూడెం వరకు అలానే కమలాపురం నుండి చింతగుప్ప అడవిరామారం నుండి ఎర్రబూరు మండలంలోని తదితర గ్రామాల రోడ్ల నిర్మాణానికి ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ ప్రజాపంతా ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కార్యదర్శి సాయన్న వీరభద్రం మాట్లాడుతూ మండల వ్యాప్తంగా నిర్మాణం లో ఉన్నటువంటి బీటీ రోడ్లను ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని రోడ్ల నిర్మాణాలను నాసిరకంగా నిర్మిస్తున్నారని 20 కోట్లతో నిర్మించే రోడ్డు కల్వర్టులు నాసిరకంగా ఉన్నాయని మండలంలోని బీటీ రోడ్లు అధికారుల పర్యవేక్షణ లేకుండా తూతూ మంత్రంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు మండలంలో నిర్మాణంలో ఉన్న రోడ్లను ఉన్నత అధికారులు ఆర్ అండ్ బి ఇంజనీర్లు పరిశీలించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ముదిరాజు భీమయ్య శంకర్ రమేష్ రామ్ శెట్టి కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.





