మన్యం న్యూస్,ఇల్లందు:తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఇల్లందు బీఆర్ఎస్ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఉదయం ఫిర్యాదు చేశారు. నిరుద్యోగ మార్చ్ పేరిట ఖమ్మంలో నిర్వహించిన సభలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఎంతో దోహదపడిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులను, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసి ఉద్యమ జ్వాలలు రేకెత్తించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అనుచిత పదజాలంతో దుర్భాషలాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరుస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన బిజెపి రాష్ట్రఅధ్యక్షులు బండి సంజయ్ అనుచితుల వ్యాఖ్యల పట్ల ఇల్లందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బగ్గుమన్నాయి. బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల జిల్లా సీనియర్ నాయకులు యలమద్ది రవి, ఉద్యమనాయకులు మేకల శ్యామ్, ఆదూరిరవి, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జులు ఎంటెక్ మహేందర్, పాలడుగు శేఖర్, సత్తాల హరికృష్ణ, సదరం మహేష్, నీలం రాజశేఖర్, ఈర్ల శ్రీకాంత్ యాదవ్, పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గండ్ర చంద్రావతి, బొప్పి భాగ్యలక్ష్మిలు ఖమ్మంలోని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు సిఐ కరుణాకర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.





