మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 28: అశ్వరావుపేట లో ఏఐటీయూసీ డివిజన్ నాయకులు కీర్తిశేషులు కామ్రేడ్ తిరుణాతి సత్యనారాయణ ఇటీవలే అకస్మిక మరణాన్ని పురస్కరించుకొని ఆయన సంతాప సభను ఆదివారం నాడు అశ్వరావుపేట నియోజకవర్గం కార్యదర్శి సయ్యద్ సలీం అధ్యక్షతన ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సంతాప సభకు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ షాబీర్ భాష పాల్గొన్నారు. ఈ సందర్బంగా షాబీర్ భాషా మాట్లాడుతూ ఆయన ఆకస్మిక మరణాన్ని విని ఆయన దిగ్భ్రాంతి లోనైయ్యానట్లు తెలిపారు. ఆయన మరణం అశ్వరావుపేట భారత కమ్యూనిస్టు పార్టీకి తీరనిలోటని, మంచితనం మానవత్వం క్రమశిక్షణ కలిగిన నాయకుడిని కోల్పోయామని ఆయన అన్నారు. అశ్వరావుపేట సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ఆరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పేద ప్రజల ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేసి ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారని, ఆయన పేద ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేస్తూ కష్టపడ్డారని ఆయన ఆశయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ నెరవేరుస్తుందని ఆయన బాటలోనే క్రమశిక్షణతో నడిచి ఆయన ఆశయాలను సాధిస్తామని ఆయన అన్నారు. ఈ సంస్కరణ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు నారాటి ప్రసాద్, మండల కార్యదర్శి కామ్రేడ్ గన్నిన రామకృష్ణ, మండల సహాయ కార్యదర్శి కామ్రేడ్ సయ్యద్ రఫీ, వగ్గెల అర్జున్ రావు, జై అలాబద్దీన్, తోడం బుచ్చప్ప, సాల్వ రవి, చిన్నోడు, మహిళా మండలి నాయకురాలు చీపుర్ల సత్యవతి, షేక్ దిల్షాద్, షేక్ రిజ్వానా, తోట శ్యామల, మునుగొండ ముక్తేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.





