ఘన నివాళులు అర్పించిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్* మన్యంన్యూస్,ఇల్లందు..సురవరం ప్రతాపరెడ్డి జయంతిని ఇల్లందు గ్రంధాలయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ దిండిగల రాజేందర్ నేతృత్వంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ప్రతాపరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, పట్టణ అధికార ప్రతినిధి కుంటనవాబ్, మండల ఉపాధ్యక్షుడు డేరంగుల పోశం, మండల కోఆప్షన్ సభ్యులు ఘాజి, మండల ఆత్మ కమిటీ చైర్మన్ బావుసింగ్, పట్టణ నాయకులు రాచపల్లి శ్రీను, ఎంటెక్ మహేందర్, పాలడుగు రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.





