- అధైర్య పడకండి అండగా ఉంటాం
- బాధిత కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 29
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,కమ్మ మహాజన సంఘం సభ్యులు కుడితిపూడి.వెంకటేశ్వర్లరావు, అమ్మ పాపమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ.అజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సోమవారం వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం పాపమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధైర్య పడవద్దు అని అండగా ఉంటామని బాధ్యత కుటుంబ సభ్యులకు వారు బరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, ఎంపిటిసిల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ ముఖ్య నాయకులు,కమ్మ మహాజన సంఘం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.