మన్యం న్యూస్ గుండాల..మండలం పరిధిలోని మామ కన్ను గ్రామంలో వైభవంగా బొడ్రాయి మహోత్సవం. గత రెండు రోజులుగా పూజలు హోమాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజలు మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తుదిఘట్టం అష్టదిగ్బంధనం తో ఈ వేడుక ముగుస్తుంది. బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు అష్టదిగ్బంధన కార్యక్రమం ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు అందుచేత గ్రామంలోకి బయటి వ్యక్తులు ఎవరు ప్రవేశించకూడదని వారు కోరారు. అష్టదిగ్బంధన ముగిసిన అనంతరం రాకపోక లేదా విధిగా కొనసాగుతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు