- ఆదివాసీ సేన, వివిధ వాటి అనుబంధ సంఘాల కమిటీల ఎన్నిక
- -ఆదివాసి సేన అశ్వరావుపేట మండల అధ్యక్షులుగా సొందేం సుమన్
- మహిళా సేన అధ్యక్ష కార్యదర్శులుగా కొర్సా సునీత, భేతి నాగమ్మ
- రైతు సేన, కార్మిక శాఖ, విద్యార్థి సేన మండల అధ్యక్షులుగా కొర్స వెంకటేష్, కొరస సహదేవుడు, సొడేం సీతయ్య
మన్యం న్యూస్, అశ్వరావుపేట, మే, 30: మండల పరిదిలోని వాగొడ్డుగూడెం గ్రామంలో ఆదివాసి సేన విస్తృత స్థాయి సమావేశం మంగళవారం జరిగింది. ఆదివాసీ సేన జిల్లా కమిటీ సభ్యులు కురసం బాబురావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్నికల పరిశీలకులుగా నాయకులు బేతి రమేష్, కనితి వెంకటేష్ వ్యవహరించారు. అశ్వరావుపేట మండల వివిధ కమిటీలు ఆదివాసి సేన రైతుసేన, కార్మిక సేన, మహిళా సేన, విద్యార్థి సేన ఎన్నుకోవడం జరిగింది. ఆదివాసి సేన అశ్వరావుపేట మండల అధ్యక్షులుగా సోందెం సుమన్, ప్రధాన కార్యదర్శిగా పుణ్యం రమేష్, ఉపాధ్యక్షులుగా తురసం కృష్ణ, సహాయ కార్యదర్శిగా ఉమ్మల కామేష్, రెడ్డి కమిటీ సభ్యులుగా తాటి నరేష్, బండారు రవికుమార్, తాటి ప్రవీణ్, కుంజా ప్రేమ్ కుమార్, ఆదివాసి రైతుసేన మండల అధ్యక్షులుగా కొర్సా వెంకటేష్, కొర్సా శ్రీరాములు కారం చెన్నారావు, కొవ్వాసి ఊసప్ప, భేతి ప్రసాద్, సొందం సురేష్, మల్లం లక్ష్ముడు, ఆదివాసి మహిళ సేన అధ్యక్షులుగా కొర్సా సునీత, కార్యదర్శిగా బేతి నాగమ్మ, ఉపాధ్యక్షులుగా కుంజా పార్వతి, దాట్ల చుక్కమ్మ, కమిటీ సభ్యులుగా కారం సీత, కొర్రి తిరుపతమ్మ, కొర్సా విజయ, చీమల రాములమ్మ,సున్నం పార్వతి, బేతి రామలక్ష్మి ఆదివాసి కార్మిక సేన మండల అధ్యక్షులుగా కొర్సా సహదేవుడు, కార్యదర్శిగా బెతి కమలహాసన్, ఉపాధ్యక్షులుగా తెల్లం సురేష్, కమిటీ సభ్యులుగా కొర్సా చిన్న రాముడు, బెతి వెంకటేష్ కుర్సం ముత్యాలు మడివి పాపారావు, ఆదివాసి విద్యార్థి సేన మండల అధ్యక్షులుగా సొడెం సీతయ్య, కార్యదర్శిగా కొర్సా లిఖిత, ఉపాధ్యక్షులుగా కుర్సం భాను ప్రసాద్, కుంజ అశోక్, కొర్స అరుణ లు ఎన్నుకున్నారు. ఈ కమిటీ ఎన్నిక అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆదివాసి చట్టాల హక్కులను నిరంతరం ఆదివాసీలకు చేరవేస్తూ ప్రశ్నించే తత్వాన్నీ నేర్పుతూ ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని పంచుతూ, చైతన్యుల్ని చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఆదివాసి హక్కుల చట్టాల అమలు కోసం అహర్నిశలు కష్టపడాలని వారు పిలుపునిచ్చారు.