మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 30
మణుగూరు మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జరుగుతున్న పలు అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మంగళవారం నాయకులతో కలిసి పరిశీలించారు.అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు.పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే నేపథ్యం లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.వర్షాకాలం నేపథ్యంలో పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి బొలిశెట్టి నవీన్,పార్టీ సీనియర్ నాయకులు వట్టం.రాంబాబు, యాదగిరి గౌడ్,ముద్దంగుల కృష్ణ,యువజన నాయకులు, టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు,జాగృతి అధ్యక్షులు పవన్ నాయక్, యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు సురేంద్ర పటేల్ తదితరులు పాల్గొన్నారు.