మన్యం న్యూస్ మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలం లో సోమవారం కొమరం బీమ్ విగ్రహం దగ్గర కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఎమ్మార్పీఎస్ మంగపేట మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ అధ్యక్షుతన ఎస్సి వర్గీకరణ సాధన కోసం జూన్ 3 నుండి 12 వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. మాదిగ ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొని వరంగల్ ఉమ్మడి జిల్లాలో జరగబోయే ఎమ్మార్పిఎస్ సభకు ప్రతి ఒక్కరూ హాజరై సభ ను విజయవంతం చేయాలనీ కోరారు.ములుగు జిల్లా ఇంచార్జి ఇరుగు పైడి మాదిగ మడిపెల్లి శ్యామ్ బాబు మాదిగ మాట్లాడుతూ మంగపేట మండలం లోని మాదిగ ప్రజలు నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లా లో జూన్ 4న జరిగే మహాసభలను విజయవంతం చేయాలనీ ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో వచ్చి సభను విజవంతం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటనకే పరిమితం కాకుండా ఆచరణ లోనికి వచ్చి రూట్ మ్యాఫ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఎస్సి వర్గీకరణ సాధించడానికి అనుకూలమై ఉంది ఈ సమయం లో మాదిగలమంతా ఏకమై ఉద్యమాన్ని కొనసాగిదాం జూన్ 4వ తారీఖున ఆర్ట్ సైన్స్ కాలేజి లో ఆడిటోరియం ప్రాంగణం లో ఉమ్మడి వరంగల్ జిల్లా లో బహిరంగ సభలో మంద కృష్ణ మాదిగ ముఖ్యఅతిధిగా పాల్గొంటారు అని తెలియజేశారు.ఈ రోజు మంగపేట మండలం లో కరపత్రంలు ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ మంగపేట మండల ఇంచార్జ్ గుగ్గిళ్ల సురేష్ మాదిగ, లంజపెల్లి రాము,మంగపేట ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు గుండేటి జంపయ్య తదితరులు పాల్గొన్నారు.