మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు గత కొన్ని సంవత్సరాలు గా అత్యుత్తమ ప్రతిభని కనబరుస్తూ మాకు మేమే పోటీ మాకు ఎవరు రారు సాటి అంటున్నారు. ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ కార్పొరేట్ కాలేజీలను తలదన్నే విధంగా మంచి మార్కులు సాధించిన సందర్బంగా కళాశాల విద్యార్థుల
ఫ్లెక్సీ ఆవిష్కరణలోపాల్గొన్న ప్రిన్సిపాల్ గూళ్ల వెంకటయ్య మాట్లాడుతూ
ఉన్నత ఆశయం కల విద్యార్థులకు ఉత్తమ విద్య ప్రభుత్వ కళాశాలల్లోనే లభిస్తుందని, ఎక్కటి సరోజని శేషారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గూళ్ల వెంకటయ్య అన్నారు.గురువారం కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల ప్రగతి ఫలితాలు, ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని వెంకటయ్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉన్నత ప్రమాణాలు,విలువలతో కూడిన విద్యను అందించడానికి నిత్యం శ్రమిస్తున్నామని అన్నారు. ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉపకార వేతనాలు అందిస్తున్న ప్రభుత్వ కళాశాలల్లోనే మండల ప్రజలు తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం వై. రేణుకాదేవి,జె జ్యోతిర్మయి, ఎం.సంతోష్ కుమార్, ఎం.లక్ష్మణ్, పి.అనిల్ కుమార్, జె.రవీందర్ నాయక్, బి.శ్రీనివాస్, ఎం.చిరంజీవి, బోధనేతర సిబ్బంది దేవదాసు, లక్ష్మి పాల్గొన్నారు.