మన్యం న్యూస్ ఏటూరునాగారం:ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిదిలోని కామారం గ్రామనికి చెందిన రేగా. నర్సయ్య(86)సంవత్సరాలు బుధవారం అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వారి నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి మనో ధైర్యం చెప్పారు. ఆయన వెంట రేగా కుటుంబ సభ్యులు కామారం గ్రామస్తులు పాల్గొన్నారు.