మన్యం న్యూస్ మణుగూరు టౌన్: జూన్ 2
మణుగూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర 10వ అవతరణ దశాబ్ది దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్భంగా ఎంపీపీ కారం.విజయకుమారి జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం మండల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్ది కాలం లో తెలంగాణ సాధించిన విజయాలను, చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం విజయ కుమారి, ఎండిఓ చంద్రమౌళి,ఎంపీఓ,వెంకటేశ్వర్లు,ఎంపీటీసీ కనితి. బాబురావు,గాండ్ల సురేష్,కర్ల. వెంకన్న,మండల పరిషత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.