మన్యం న్యూస్, పినపాక:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు దశాబ్ది దినోత్సవ వేడుకలను సంతోషంగా నిర్వహించారు. 10 సంవత్సరాలలో తెలంగాణలో జరిగిన పురోభివృద్ధిని గురించి పలువురు వక్తలు మాట్లాడారు. పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. పినపాక మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి జాతీయ జెండాను రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఎగరవేశారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఆయా కార్యాలయాల అధికారులు జాతీయ జెండాను ఎగరవేసి, కింది స్యి అధికారుల యొక్క నిబద్ధత గురించి కొనియాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, గత పాలకుల పరిపాలనలో సంతోషం కరువైందని అన్నారు. ఈ కార్యక్రమాలలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.