మన్యం న్యూస్ కరకగూడెం: కరకగూడెం గ్రామపంచాయతి కార్యాలయంలో పని చెస్తున్న కార్మికులకు స్థానిక సర్పంచ్ ఊకె.రామనాథం అధ్వర్యంలో ఎంపిపి రేగా కాళికా దుస్తులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం నూతన గ్రామపంచాయతిలతో పాటు పాత గ్రామపంచాయతి లకు పంచాయతి సిబ్బందిని ఎర్పాటు చేసి గ్రామాలలో ఉన్న చెత్త చెదరం సేకరించి గ్రామాలను శుభ్రంగా ఉంచుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. అలాగే కరోన సమయంలో గ్రామపంచాయతి సిబ్బంది చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్యాం సుందర్ రెడ్డి,బిఅర్ఎస్ పార్టీ మండల ప్రదాన కార్యదర్శి బుడగం.రాము,నాయకులు రేగా సత్యనారాయణ,గ్రామపంచాయతి కార్మికులు ఇల్లందుల.పిచ్చయ్య,నైనరపు.మల్లయ్య,మెంతిని.శంకర్,గొడ్డటి.సునీత, పోడుతూరి.జమున పాల్గొన్నారు