మన్యం న్యూస్ గుండాల: ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మండలంలో నిర్వహించారు. స్థానిక తహాసిల్దార్ కార్యాలయంలో తహాసిల్దార్ నాగదివ్య జెండా ఎగరవేయగా పోలీస్ స్టేషన్ లో సిఐ రవీందర్ జెండాను ఎగరవేశారు. మండలంలోని కార్యాలయాలు అన్నిటిలో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో సైతం రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించారు