UPDATES  

 రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్

  • రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్
  • రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న తెలంగాణ రాష్ట్ర సారథి కేసీఆర్: ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్

మన్యంన్యూస్,ఇల్లందు:తెలంగాణ రాష్ట్రం సిద్ధించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు హరిప్రియ హరిసింగ్ నాయక్ జాతీయజెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రసాధనలో అమరులైన వీరులందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నారు. వారి ప్రాణత్యాగానికి విలువనిస్తూ, పట్టువదలని విక్రమార్కుడిలా, తన ప్రాణాలనూ సైతంపణంగా పెట్టి తెలంగాణరాష్ట్ర సాధనకై అన్ని వర్గాలను ఏకతాటిపై నడిపించి స్వరాష్ట్రం సాదించిపెట్టిన దీరోత్తమశాలి కేసీఆర్ అని తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే అన్నిరంగాల్లో వెనక్కి నెట్టబడిన తెలంగాణను ఈ ఎనిమిది ఏళ్లలో యావత్ ప్రపంచం తెలంగాణ వైపు చూసేలా అభివృద్ధి చేస్తూ, బంగారు తెలంగాణగా మలిచేందుకు కృషిచేస్తున్న నిరంతర శ్రామికుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు మరియు రాష్ట్రఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో రాష్ట్రసాధనే ఏకైక లక్ష్యంగా ప్రాణాన్ని పణంగా పెట్టి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడంలో మన సీఎం కేసీఆర్ ఈ తొమ్మిది సంవత్సరాలు చేసిన అవిరామ కృషి, అలుపులేని దీక్ష అనుక్షణం జరిపిన మేధోమధన ఫలితం నేడు మన కళ్ళముందు ప్రత్యక్షంగా కనబడుతోందని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ పేర్కొన్నారు. రానున్న కాలంలో కేసీఆర్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభజనం సృష్టించి అభివృద్ధిలో పెనుమార్పులు తేవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీపాషా, జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు ఆజామ్, తోట లలితశారద, సిలివేరి అనిత, కడగంచి పద్మ, వాంగుడోత్ తార, జిల్లా నాయకులు సిలివేరు సత్యనారాయణ, ఇల్లందు పట్టణ ఇంచార్జ్ సుధీర్ తోత్ల, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షులు పివి కృష్ణారావు, అబ్దుల్ నబీ, హరి గోపాల్ శర్మ, ఇల్లందు ఆత్మ కమిటీ చైర్మన్ భావుసింగ్, డిసిసిబి డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, ఇల్లందు పట్టణ మహిళా ఉపాధ్యక్షురాలు గండ్రాతి చంద్రావతి, మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మం పాటి రేణుక, పట్టణ యూత్ ప్రెసిడెంట్ మెరుగు కార్తీక్, మండల కోఆప్షన్ సభ్యులు ఘాజి, యువజన నాయకులు పాలడుగు రాజశేఖర్, నెమలి నిఖిల్, పట్టణ నాయకులు కడగంచి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !