UPDATES  

 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది*

  • తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది*
  • దశాబ్ది ఉత్సావాలను విజయవంతం చేయండి
  • పిలుపునిచ్చిన బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్

    మన్యం న్యూస్ గుండాల:
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని ఈ ఉత్సవాలను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీ ఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ అన్నారు. జూన్ 2 తెలంగాణ అవతరణ దినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గడచిన తొమ్మిది సంవత్సరాల లో భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కండ్లుగా భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫలితాలను నూరు శాతం సాధించారని అన్నారు. పినపాక నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత, ఆదివాసి ముద్దుబిడ్డ, కొమరం భీమ్ స్ఫూర్తితో, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పినపాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు భారత జాతీయ పథకాన్ని ఎగరవేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు అని అన్నారు. పినపాక నియోజకవర్గం లో పార్టీ బలంగా ఉందని తెలుసుకున్న ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలను చేస్తున్నాయని అన్నారు. అభివృద్ధి ఆకాంక్షించే నాయకుడికి అండగా నిలవాల్సిన అవసరం నియోజకవర్గ ప్రజలపై ఉందని ఆయన అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !