మన్యం న్యూస్ దుమ్ముగూడెం జూన్ 2::
మహిళ ప్రజలపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ డబ్ల్యూ ఎఫ్ ఐ అధ్యక్షులు బ్రీజ్ భూషణ్ చరణ్ సింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం దుమ్ముగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ములకపాడు సెంటర్ నందు కేంద్ర ప్రభుత్వం భూషణ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ మాట్లాడుతూ అంతర్జాతీయంగా పథకాలు సాధించి దేశానికి గౌరవాన్ని ప్రతిష్టను తెచ్చిపెడుతున్న ఒలంపిక్ పతక విజేతలను అగౌరపరచడం కాకుండా మహిళలను లైంగికంగా వేధింపులు గురిచేస్తున్న డబ్ల్యూ ఎఫ్ ఐ అధ్యక్షుడు చరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత కొద్ది రోజులుగా నిరసన తెలుపుతున్న క్రీడాకారులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరికి ప్రజలు గమనించి త్వరలోనే బుద్ధి చెప్తారని అన్నారు ప్రజలందరూ కూడా నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు న్యాయం జరిగే వరకూ అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం దుమ్ముగూడెం అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ కొడాలి లోకేష్ బాబు రైతు సంఘం సీనియర్ నాయకులు శ్రీనుబాబు ఎండి బేగ్ కల్లూరి శ్రీను గుడ్ల తాతారావు నాగిరెడ్డి సీతారామయ్య వీర్రాజు తదితరులు పాల్గొన్నారు