- కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం
- మణుగూరు మండల అధ్యక్షులు పీరినాకి నవీన్
మన్యం న్యూస్ మణుగూరు టౌన్:జూన్ 2
మణుగూరు కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ కార్యాలయం ముందు మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ జాతీయ జెండాని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోనియమ్మ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారని,కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ ఏర్పడిందని ఈ విషయం తెలంగాణ ప్రజలు అందరికీ తెలుసన్నారు.సీఎం కేసీఆర్ మాయ మాటలు నమ్మి 2014లో 2018లో టిఆర్ఎస్ ను గెలిపిస్తే తెలంగాణ ప్రజలను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు.నీళ్లు మనవి, నిధులు మనవి,కొలువులు మనవి అని మాయమాటలు చెప్పి,ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. ఇకనైనా తెలంగాణ ప్రజలు కేసీఆర్ మోసాన్ని గ్రహించి 2023లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి, అధికారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం జరగాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా సోనియమ్మ చిత్రపటానికి సీనియర్ నాయకులు సాయిని. వెంకటేశ్వరరావు,నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమం లో మండల ఉపాధ్యక్షులు కలబోయిన మాధవరావు, సీనియర్ నాయకులు పాల్వంచ రాములు,బీసీ సెల్ మండల అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణ,ముస్లిం మైనార్టీ మండల అధ్యక్షులు లతీఫ్,మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షులు కూరపాటి సౌజన్య,మండల నాయకులు జిమ్మ ఆదినారాయణ,లాలు, నవీన్,యువ నాయకులు సోలం శివ,కలబోయిన నాగరాజు,గుండాల శివ,కారం పవన్ తదితరులు పాల్గొన్నారు.