మన్యం న్యూస్ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు దేశానికి అన్నం పెట్టే రైతులను గుర్తించి రైతు దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం చెప్పడంతో మండల అధికారులు, రెవెన్యూ పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఎంపీపీ రేగా కాళికా, జెడ్పిటిసి కొమరం.కాంతారావు హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ అమలు కావడం లేదని వారు అన్నారు. తెలంగాణలో రైతులకు రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు సబ్సిడీలో ఎరువులు విత్తనాలతో అందిస్తుండడంతో రైతులు ఎంతో ఆనందంగా రెండు పంటలు పండిస్తున్నారని వారు అన్నారు. నిధులు నియామకాలు నీళ్లు అనే నినాదంతో ఏర్పడిన తెలంగాణ ఉద్యమం తెలంగాణను సాధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వంలో రైతులను రాజు చేయాలనే ఉద్దేశంతో అనేక పథకాలను అందిస్తుందని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిపై చర్చ జరగాలని రైతులు సర్పంచులు అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. తదనంతరం వ్యవసాయ శాఖ అధికారులు సెటర్జీ, ప్రశాంత్, అనిల్ వ్యవసాయ శాఖ ప్రగతి నివేదికను రైతులకు అందజెశారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మార్కెటింగ్ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు, ఎంపీటీసీ ఎలిపెద్ది శైలజ, మునీంద్ర, సర్పంచులు, ఇరప్ప విజయ్, ఊకే రామనాథ, పాయం నరసింహారావు, భాగ్యలక్ష్మి, పాపమ్మ, పోలబోయిన నరసింహారావు, వసంతరావు, సాంబ లక్ష్మి, సావిత్రి, బత్తిని నరసింహారావు, సరోజినీ, అధికారులు,తహశీల్దారు ఉషా శారద, డిప్యూటీ తాసిల్దార్ సంధ్య, ఎంపీడీవో శంకర్, ఎం పి ఓ శ్యాంసుందర్ రెడ్డి, ఆర్ ఐలు రాజు, హుస్సేన్, కార్యదర్శులు, శ్రీకాంత్, శ్రీజ ,మారుతి, తరుణ్ ,రవి, నాగేశ్వరరావు, వీరన్న ,శ్రీనాథ్ ,మధు, రమేష్ ,రామకృష్ణ ,హరినాథ్, సురేష్, కోపరేటివ్ డైరెక్టర్స్ రావుల కనకయ్య, ముద్దం సతీష్, మండల సీనియర్ నాయకులు, రేగా సత్యనారాయణ, సంజీవరెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, కొంపల్లి రామలింగం, యువజన నాయకులు శ్రీను, కటకం లెనిన్, యువజన నాయకులు 16 పంచాయతీల గ్రామాల రైతులు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.