మన్యం న్యూస్,ఇల్లందు:తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ఆదేశాల మేరకు హరీష్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించటం జరిగింది. జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి మంత్రి హరీష్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, ఇల్లందు పట్టణ ఇంచార్జ్ సుధీర్ తోత్ల, ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షుడు పివి కృష్ణారావు, అబ్దుల్ నబీ, ఇల్లందు పట్టణ నాయకులు గిన్నారపు రవి, వసంతరావు, ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, ప్రచార కార్యదర్శి రాఘవరపు రాకేష్, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షురాలు గండ్రతి చంద్రావతి, ఉప సర్పంచ్ తాండ నాగరాజు, మండల ఉపాధ్యక్షుడు డేరంగుల పోశం, యువజన నాయకులు పాలడుగు రాజశేఖర్, బానోత్ సుమన్, సదానందం తదితరులు పాల్గొన్నారు.