- రైతు మురిసే అభివృద్ధి మెరిసే
- పారదర్శకంగా ప్రభుత్వ పాలన
- స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు
- రైతన్నకు కొండంత అండగా సీఎం కేసీఆర్
- తెలంగాణ రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్: జూన్ 3
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం తుమ్మల చెరువు గ్రామ పంచాయతీ పరిధి లోని రైతు వేదిక నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైతు దినోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు కు రైతులు,మహిళలు,స్థానిక నాయకులు పూలమాలలు, ఆట పాటలు,డబ్బు చప్పులతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు మాట్లాడుతూ,బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు.తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని, రైతు కు పెట్టుబడి సాయం అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు.రైతుబంధు పథకం ద్వారా చిన్న సన్నకారు రైతులకు కూడా మేలు జరుగుతందన్నారు.రైతు బంధు పథకం ద్వారా 10 వేల రూపాయలు చొప్పున ఎకరానికి పెట్టుబడి సాయం అందిస్తున్నారని,ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడ లేదని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రైతులను రాజులను చేసిన ఘనత బిఅర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.వ్యవసాయం దండగ అన్న పరిస్థితి నుండి వ్యవసాయమే పండగ అనే స్థాయికి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత సీఎం కేసిఆర్ కు మాత్రమే సాధ్యం అవుతుంది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ,రైతుకు వెన్నుముకగా నిలుస్తూ రైతుబంధు,రైతు భీమా,24 గంటలు ఉచిత విద్యుత్,ఎరువులు వంటి పథకాలు అమలు చేయడం జరుగుతుంది అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు అన్నారు. కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టును నిర్మించి 50 లక్షల ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు,అందిస్తున్నామన్నారు.సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసి రైతులకు సాగునీరు అందిస్తున్నదని అన్నారు. జిల్లాలో కూడా సీతారామ ప్రాజెక్ట్,సీతమ్మ బ్యారేజ్ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని,త్వరలో ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎల్లపుడూ అండగా ఉంటుందని,రైతుల సంక్షేమమే ధ్యేయంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు,డి.ఎస్.పి రాఘవేంద్రరావు,ఏడిఏ తాతారావు,జడ్పిటిసి సూది రెడ్డి సులక్షణ,వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం,స్థానిక ప్రజా ప్రతినిధులు,వ్యవసాయ శాఖ అధికారులు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్,పార్టీ సీనియర్ నాయకులు,మహిళా కార్యకర్తలు,యువజన నాయకులు,రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు