మన్యంన్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలం చల్ల సముద్రం గ్రామపంచాయతీ,ముకుందాపురం గ్రామానికి చెందిన కుర్ర చిన్న ఐలయ్య గౌడ్ దశధిన కర్మలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య హాజరై, వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి అనంతరం ఆర్థిక సహాయం అందజేసారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తాటి చుక్కమ్మ, కుర్ర అరుణ, నాయకులు తాటి బిక్షం, సాంబమూర్తి, రావూరి సతీష్, ప్రసన్న కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.