UPDATES  

 ఊరూరా అభివృద్ధి… ఇంటింటా సంక్షేమం

 

మన్యంన్యూస్ ఇల్లందురూరల్: ఇల్లందు మండలం సుదిమల్ల రైతు వేదిక నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైతు దినోత్సవం జరిగింది.కార్యక్రమంలో సుదిమల్ల స్టేజి నుంచి రైతు వేదిక వద్దకు రైతు ర్యాలీలో ఎమ్మెల్యే హరిప్రియ ట్రాక్టర్ నడిపి రైతులు ఉత్తేజ పరిచారు.అనంతరం జరిగిన సభలో ఇల్లందు శాసన సభ్యురాలు బానోత్ హరి ప్రియ నాయక్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం, రైతుకు పెట్టుబడి సాయం అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు.
రైతుబంధు ద్వారా తెలంగాణలో రైతుల ముఖాలలో చిరునవ్వులు పూయిస్తూ రైతు కుటుంబాలను సంపన్నులు చేయడానికి సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని అన్నారు.రైతుబంధు ద్వారా
ఇల్లందు నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాల కాలంలో 586 కోట్ల రూపాయల మొత్తాన్ని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిందన్నారు.
కల్తీ విత్తనాలు అమ్మిన వారిపై పిడి యాక్ట్ పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ 24 గంటలు ఉచిత విద్యుత్ అందించటం జరుగుతుంది అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసి రైతులకు సాగునీరు అందిస్తున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ జనగాం కోటేశ్వరరావు పులిగండ్ల మాధవరావు, ఏడిఏ వాసవి రాణి, ఏఈఓ శృతి, ఏఓ సతీష్, ఇల్లందు తాసిల్దార్ కృష్ణవేణి, మెట్ల కృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ భావ సింగ్, మండల పరిధిలోని రైతులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !