మన్యం న్యూస్, పినపాక :
పినపాక మండలంలోని తోగ్గూడెం గ్రామంలోని పై గుంపు పాఠశాల సమీపంలో చేతి పంపు మరమ్మతులకు గురైంది. ఈ విషయం మండల ప్రజా ప్రతినిధుల దృష్టికి యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బండ మనోజ్ కుమార్ రెడ్డి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే రేగా చొరవతో శనివారం బోరుకు మరమ్మత్తులు నిర్వహించడంతో గ్రామస్థుల తాగునీటి సమస్య తీరింది. సమస్య విన్న వెంటనే స్పందించి పరిష్కరించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు, మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీటీసీ చింతపంటి సత్యం, మండల ఉపాధ్యక్షుడు కటకం గణేష్, సర్పంచ్ కల్తీ శ్రీలత, ఉప సర్పంచ్ బుసి శ్రీనివాసరావులకు బండ మనోజ్ కుమార్ రెడ్డి , గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.