UPDATES  

 రెజ్లర్ల పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న యంపి బ్రిజ్ భూషణ్ సింగ్ ని తక్షణమే అరెస్టు చేయాలి

  • రెజ్లర్ల పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న
  • యంపి బ్రిజ్ భూషణ్ సింగ్ ని తక్షణమే అరెస్టు చేయాలి
  • ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బ్రిజ్ భూషణ్ సింగ్ ను తక్షణమే అరెస్టు చేయాలని ఫోక్సో కేసు నమోదు చేయాలని చెప్పి కోరుతూ భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టీ యు) జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు శనివారం నల్లజెండాలతో నోటికి నల్ల జెండాలు కట్టుకొని మౌన నిరసన తెలియజేయడం జరిగింది.
అనంతరం యూనియన్ జిల్లా అధ్యక్షుడు తోడేటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మౌన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి మాట్లాడుతూ 2016 నుంచి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళ రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని అనేకసార్లు పోలీసులకు ప్రభుత్వ అధికారులకు తెలియజేసిన ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని సుప్రీంకోర్టు ను ఆశ్రయించగా తక్షణమే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ని అరెస్టు చేయాలని తీర్పునిచ్చినప్పటికీ బిజెపి ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కై కనీసం కేసు కూడా పెట్టనిచ్చే పరిస్థితులు లేరని ఆయన అన్నారు. అంతర్జాతీయంగా భారతదేశానికి పేరు తీసుకొస్తున్న మహిళ క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడడం అందులోనూ మైనర్ అమ్మాయిలను వేధించడం బ్రిజ్ భూషణ్ సింగ్ ని అరెస్టు చేసి ఫోక్సొకేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కుస్తీ క్రీడాకారులు పోటీపడి అవార్డులు గెలుచుకున్న ఈ కుస్తీ క్రీడాకారులు ఈరోజు బిజెపి ప్రభుత్వంతో కుస్తీ పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.అంతేకాకుండా మొన్న పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం రోజు జంతర్ మంతర్ ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్ల పై పోలీసులు లాటి చార్జ్ చేయడాన్ని ఖండిస్తూ తక్షణమే వారిపై చర్య తీసుకోవాలని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గౌని నాగేశ్వరరావు,సహాయ కార్యదర్శి నెమిళ్ళ సంజీవ్,కోశాధికారి మోత్కూరి మల్లికార్జునరావు,మహిళా సంఘం (పి ఓ డబ్ల్యూ)జిల్లా అధ్యక్షురాలు వీరమల్ల ఉమా,యాసారపు వెంకన్న,పుష్పరాజు,కూరాకుల నరసింహారావు,మల్లయ్య,నాగన్న, ఏట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !