మన్యం న్యూస్, మంగపేట.
శనివారం మంగపేట మండలo లోని కొత్తూరు మొట్లగూడం గ్రామంలో నిన్న వరి పంట కోతకు రాకముందే గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో క్రమంగా పంట పొలాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగి గ్రామ సమీపంలోని బంగారి నగేష్ , పోదెం పాపయ్య ల ఇండ్లు అంటుకోవడంతో అది గమనించిన గ్రామస్తులు మంటలను ఆర్పడంతో పాక్షికంగా కాలిపోయాయి. అది తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చేట్టిపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లి ఇండ్లు కాలిపోయిన వారిని పరామర్శించి వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చేప్పి పాక్షికంగా కాలిపోయిన రెండు ఇల్లుల బాధితులకు ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెల నరేష్,మండల ప్రధాన కార్యదర్శి కారుపోతుల నరసయ్య గౌడ్, మండల కార్యదర్శి ఏం పెళ్లి సమ్మయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లన్న, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్, మండల సీనియర్ నాయకులు…
దామెర సారయ్య, అయ్యోరి యనయ్య, తుడి భగవాన్ రెడ్డి, బండ జగన్ మోహన్ రెడ్డి, మసిరెడ్డి వెంకటరెడ్డి,తోట అశోక్, బూర్గుల సతీష్, మార్పుల దయాకర్ రెడ్డి, గడ్డం నరసయ్య, జిగట బాబు, పోదెం పాపయ్య, బంగారి నరసయ్య, తదితరులు హాజరయ్యారు.