మన్యం న్యూస్, అశ్వారావుపేట, జూన్, 03: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అశ్వారావుపేట లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యవసాయానికి సంబంధించిన ఎగ్జిబిషన్ అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. ఆగ్రో నెక్స్ట్ భూ పరీక్ష పరికరాన్ని ఇండియాలో మొట్టమొదటిసారిగా ఏరిస్ కంపెనీ ఆధ్వర్యంలో రూపొందినించారి, పరికరాన్ని ఎమ్మెల్యే మెచ్చా లాంఛనంగా ప్రారంభించారు. ఈ పరికరం ద్వారా రైతుల వద్దకే పరికరాన్ని తీసుకొచ్చి మట్టి ఎనలసిస్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా భూమి యొక్క లోపాన్ని రెండు నిమిషాల్లోనే తెలుసుకోవడం జరుగుతుంది. అదే విదంగా ఎన్ఎస్ఎస్ వాలింటర్ లకు ఎమ్మెల్యే మెచ్చా సర్టిఫికెట్ లు అందజేసారు. అలాగే పిజి ఏర్పాటు కొరకు విద్యార్థులు ఎమ్మెల్యేకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ దేశానికే వ్యవసాయంలో మన తెలంగాణ రాష్ట్రం ఆదర్శమని ముఖ్యంగా అశ్వారావుపేటలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండటం చాలా సంతోషకరమని, ఆ నాడు అశ్వారావుపేటలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటులో ప్రస్తుత మన ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కీలకంగా ఉందని, భవిష్యత్తు మొత్తం వ్యవసాయం మీదే ఆధార పడి ఉంటుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, హాస్టల్ ఇబ్బందిగా ఉందని తెలియడంతో వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి, మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి అలాగే మంత్రి పువ్వాడ అజెయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి 7కోట్లు నిధులు మంజూరు చేయించి భవనం నిర్మించుకొని ఇటీవలే మంత్రితో కలిసి ప్రారంభించుకోడం జరిగిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, మోహన్ రెడ్డి, కాసాని చంద్ర మోహన్, యు ఎస్ ప్రకాష్, తాడేపల్లి రవి, కిషోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.