*ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి
సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా డిమాండ్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి మాచర్ల సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కొత్తగూడెంలోని సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా పార్టీ ఆఫీసులో ఆకాంక్ష దీక్ష దివాస్ కరపత్రాలను ఆవిష్కరించారు .ఈ సందర్బంగా మాచర్ల సత్యం మాట్లాడుతూ కోటి ఆశలతో విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు ,సకల జనులు, తెలంగాణ కోసం ఉద్యమించారని అన్నారు. తమ ఉద్యోగాలు తమకే వస్తాయని ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశపడ్డారు. విద్యారంగం కార్పొరేట్ పడకనీడ నుంచి బయట పడుతుందనుకున్నారు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగం అనే పదమే ఉండదన్న నినాదంపై ఎంతో ఆశలు పెంచుకున్నారు.
ఫారెస్ట్ లో పోడ భూములపై తమకు హక్కులు దక్కుతాయని, ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాల భూమి వస్తుందని, రైతు రుణాలన్నీ రద్దు అవుతాయని ,రేషన్ కార్డులు,ఇండ్లు ,పెన్షన్లు అందరికీ వస్తాయని ఆశపడ్డారని అన్నారు.
కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎక్కడ నెరవేర్చిన ది లేదని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష
రైతుల రుణాలను మొత్తంగా మాఫీ చేయాలని,పోడు భూములు అన్నిటికి పట్టాలివ్వాలని ,గిరిజనేతర పేదలకు సాగు హక్కులు కల్పించాలని, రేషన్ కార్డులు, పెన్షన్లు ,ఇండ్ల ,స్థలాలు అర్హులందరికీ ఇవ్వాలని,ధరణి వెబ్సైట్ లో అవకతవకలను వెంటనే సరి చేయాలని, ఉప చట్టం రద్దు చేయాలని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని ,నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని ,ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంయల్ ప్రజాపంధా డివిజన్ నాయకులు బి.దర్మ,వ్తె.గొపాల్ రావు,పెద్దబోయినసతీష్ ,యం.చంద్రశేఖర్ .సాయి.సమ్మయ్య,యం.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.