UPDATES  

 *అభయం ఇచ్చిన మన్యం బిడ్డ

*అభయం ఇచ్చిన మన్యం బిడ్డ
సకల సౌకర్యాలతో తులతూగుతున్న సారపాక
గోదావరి ముంపు ప్రాంతాలకు మనోదైర్యం రేగా
అభివృద్ధి,నిధుల ప్రదాతగా విరాజిల్లుతున్న రారాజు రేగా.*
అభివృద్ధికి నాంది ప్రగతి రథచక్ర విజయ సారధి రేగా.*
నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేగాదే ప్రత్యేక మార్క్

మన్యం న్యూస్ బూర్గంపహడ్:- పినపాక నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాతగా పేరు ప్రఖ్యాతలు పొందుతున్న ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,భద్రాద్రి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో దూసుకు పోతున్న విషయం తెలిసిందే,నియోజకవర్గ అభివృద్ధి,నిధుల ప్రదాతగా విరాజిల్లుతున్న రారాజు రేగా అని నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతలు లికించుకున్న వ్యక్తి రేగా అని అందరికీ తెలిసిన విషయమే,ఇగ ఇదే తరుణంలో బూర్గంపహడ్ మండలంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సారపాక గ్రామంలో గత ఏడాది వచ్చిన వరదల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బ్యాక్ వాటర్ కారణంగా ఎన్నడూ లేని విధంగా గత ఏడాది గోదావరి 72 అడుగులు వచ్చి పోయిన అనంతరం రేగా సహయ సహకారాలు మండలంలో ఎన్నో ఉన్నాయి .బ్యాక్ వాటర్ వల్ల ముందుగా నీట మునిగే మొదటి వీధి మసీద్ రోడ్డులో గల ఖాసీం వీధి,సక్రమమైన రవాణా వ్యవస్థ ట్రాలీ ఆటోలు,ట్రాక్టర్లు కనీసం ద్విచక్ర వాహనం కూడా రాలేని దుస్థితిలో ఉన్న ఈ వీధి,ఆ వీధిలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు ఇంటి సామాన్లను చేతిలో పట్టుకొని వీధి దాటాల్సిన పరిస్థితి నెలకొనగా ఇట్టి విషయం పై జెడ్పీటీసీ శ్రీలత స్వయంగా ఎమ్మెల్యే రేగా కు విన్నవించగ ఇట్టి సమస్యకు వెంటనే శ్రీకారం చుట్టండి అని ఆజ్ఞాపించారు. ఈ క్రమంలో అప్పటికే అభివృద్ధి నిధులు అయిపోవడంతో మరల నిధుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రినీ కలిసి విషయం విన్నపించి మరల గ్రామానికే కాక పలు మండలాలకి నియోజకవర్గానికి నిధులు తీసుకు వచ్చి మొదటగా సారపాకలో అదే రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఘనత రేగాది అని ప్రజలు జే,జే లు కొడుతున్నారు .గోదావరి వచ్చి పోయిన అనంతరం ప్రజలు ఎన్నో కష్టాలు పడి దాదాపు నెల రోజులు ఎన్నో అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో రేగా వరధబాధితులకు నిత్యావసరాలు సమకూర్చారు. కానీ సర్వం కోల్పోయిన ప్రజలు చిటపట పడే చినుకులు దానివల్ల విధుల్లో బురద దీంతో ప్రజలు పడే సమస్యలకు ప్రభుత్వ విప్ రేగా చెక్ పెట్టీ ప్రతి వీధి సిసి రోడ్లుగా మార్చారు.గోదావరి కష్టకాలంలో ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి కుటుంబానికి మనో ధైర్యాన్ని నింపుతూ పూర్తి సమస్యలపై దృష్టి సారించారు.గోదావరి వచ్చి విద్యుత్ స్తంభాలు సైతం నేలకొరిగి విద్యుత్ సమస్యతో ఇబ్బంది పడుతున్న నేపంలో బుర్గంపహాడ్ మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులందరూ కలిసి సత్ఫరమే స్పందిస్తూ ప్రథమ సమస్యలపై దృష్టి సారించి వరద బాధితులకు సహాయం చేశారు,అందులో భాగంగా విద్యుత్ సదుపాయాన్ని వెనువెంటనే పునరుద్ధరించారు.అనంతరం మంచినీటి సదుపాయాన్ని సైతం దగ్గరుండి సమస్యను శాశ్వత పరిష్కారం చూపారు.వీటన్నిటితో ముడిపడి ఉన్న సీసీ రోడ్డు పై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి వీధికి పది లక్షల రూపాయల వ్యయంతో అసంపూర్తిగా ఉన్న రోడ్డును తిరిగి 240 మీటర్లు పూర్తి వీధి చివరి ఇంటి వరకు సీసీ రోడ్డుకు దగ్గరుండి శంకుస్థాపన చేసి అనంతరం సీసీ రోడ్డు మొదలైన మూడు రోజుల్లో పూర్తిగా రోడ్డును వేయించడంతో రేగా అభివృద్ధి బాటలపై ప్రజలకు పూర్తి నమ్మకం వచ్చింది.
అప్పుడు
ఓ తండ్రి ఆవేదన,తమ పిల్లలు స్కూల్ కి వెళ్తున్నప్పుడు ఆ బురదలో ఎక్కడ కాలుజారి పడకుండా జాగ్రత్తగా స్కూల్ కి వెళ్లాలని,ఓ తల్లి ఆవేదన డ్యూటీ నుండి వచ్చే నా కొడుకు దారిలో ద్విచక్ర వాహనం పై నుండి జారి కింద పడకుండా ఇంటికి వస్తాడా అని,పిల్లల ఆవేదన స్కూలుకి వెళ్లాలన్న,బయటకు వెళ్లాలన్న,ఆడుకోవాలన్న అస్సలు ఏమాత్రం నడవటానికే వీలు లేని ఇలాంటి రోడ్లు ఎప్పుడు మారుతాయో అని ప్రశ్న…..? వీటన్నిటికీ ఎమ్మెల్యే రేగా ఆ ఊరి జనానికి ముందు మనో ధైర్యం “సీసీ రోడ్డు” మాత్రమే కాదు వారి ప్రతి గడప కుటుంబ ఆత్మగౌరవం,ఇందుకుగాను ఖాసీం వీధి కుటుంబాలతో,ప్రజలు రేగా కాంతారావుకి బిఆర్ఎస్ పార్టీ జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలతకి,సారపాక మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డికి,వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీష్ కి, బూర్గంపహడ్ మండల సొసైటీ అధ్యక్షులు బిక్కసాని శ్రీనివాస్ రావు కి,సారపాక టౌన్ అధ్యక్షులు కొనుగంచి శ్రీనివాస్ కి,మహిళా అధ్యక్షురాలు ఎల్లంకి లలిత కి,టిఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు రాష్ట్ర మినిమం వెజ్ బోర్డ్ మెంబర్ అయిన సానికొమ్ము శంకర్ రెడ్డి కి,బిఆర్ఎస్ పార్టీ యూత్ అతిరథ మహాసయులందరికీ ఖాసీం వీధి ప్రతి కుటుంబ సభ్యుల తరపున వీధి కన్వీనర్ మొహమ్మద్ అబ్దుల్ సాబీర్ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !