అశ్వరావుపేట బిఎస్పి ఇన్చార్జి మడకం ప్రసాద్ దొరపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఇల్లందు బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి బాదావత్ ప్రతాప్*
మన్యం న్యూస్,ఇల్లందు: అశ్వరావుపేట నియోజకవర్గ బీఎస్పీ ఇన్చార్జ్ మడకం ప్రసాద్ దొరపై బిఆర్ఎస్ నేతలు చేసిన దాడిని ఇల్లందు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఇల్లందు బీఎస్పీ ఇంచార్జ్ బాదావత్ ప్రతాప్ మాట్లాడుతూ.. మడకం ప్రసాద్ చేస్తున్న పని, ప్రజల్లో వస్తున్న ఆదరణ మరియు బీఎస్పీకి వస్తున్న ప్రజాదరణ ఓర్వలేక అశ్వరావుపేట బిఆర్ఎస్ గుండాలు దాడి చేశారన్నారు. ఇలాంటి హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ దొషులైన వారిని పోలీసులు వెంటనే అదుపులో తీసుకొని వారిపై తగినశిక్షలు వేసి కటినంగా శిక్షించాలని, మరోమారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. క్రమశిక్షణ గల రాజకీయం బీఎస్పీ నైజమని, మా మంచితనాన్ని అలుసుగా తీసుకొని దాడులకు పాల్పడితే మాత్రం తగినరీతిలో గుణపాఠం చెప్పటం తమకు తెలుసనీ, ఇటువంటి పిరికిపంద చర్యలను మానుకోవాలని హెచ్చరించారు. ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లేతాకుల కాంతారావు, ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు తచ్చడి సత్యనారాయణదొర, నియోజకవర్గ నాయకులు లోకేష్, రాజేష్ రామస్వామి, వాసు తదితరులు పాల్గొన్నారు.