మన్యం న్యూస్ బూర్గంపహడ్:- పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు బూర్గంపహడ్ మండల పరిధిలోని నాగినేని రెడ్డిపాలెం గ్రామంలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు,ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్ మండల జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ప్రాణప్రాయ స్థితిలో ఉన్న వారికి ముఖ్య మంత్రి సహాయ నిధి కింద చికిత్సకు తగిన సహాయం బాధితులకు ఆందిస్తుందని,నిరుపేదల సంక్షేమం కోసం పూర్తి భరోసా కాల్పిస్తుందని,అర్హులైన ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు,నాగినేనిప్రోలు రెడ్డిపాలెం కు చెందిన డి.హుసేన్ కి 27000 వేల రూపాయలు,వై.రాణి కి 20,000 వేల రూపాయల చెక్కులను అందజేయటం జరిగింది,ఈ కార్యక్రమం లో స్థానిక ఉపసర్పంచ్ యడమకంటి ఝాన్సీ,గ్రామ కమిటి అధ్యక్షులు మేడగం శ్రీనివాస రెడ్డి,మండల ఉప అధ్యక్షులు మొండెద్దుల వెంకటేశ్వర రెడ్డి,ఇమడబత్తిన రామకృష్ణ,మాజీ ఎంపీటీసీ వసంత,యారం వెంకట రెడ్డి,కోట జయరాజు,కడారి శ్రీను.అదేవిధంగా గ్రామపెద్దలు పార్టి నాయకులు తదితరలు పాల్గొన్నారు.
